"ఆత్రేయ పాటల్లో లోతైన భావాలు,జీవిత సత్యాలు,ఎంతో మేధస్సు ఇమిడి వున్నాయి. ప్రజల ఆలోచనలు,ఊహాగానాలు ఆయన పాటల్లో వుట్టిపడుతుంటాయి. మనిషి జీవిత అనుభవాలు,చీకటి,వెలుతురు,అపజయాల గురించి ఆయన హృదయాలకు హత్తుకునే విధంగా పాటలు రాశారు" ~ కీ.శే.ఎన్.టి.రామారావు     "మానవ జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులు, గెలుపు ఓటములను అనుభవాలను ప్రతిబింబిస్తూ మనసుల్ని కదిలించే విధంగా ఆయన రాసిన పెక్కు పాటలు చిరస్మరణీయాలై నిలిచాయి" ~ ఎన్.టి.రామారావు     "ఆత్రేయ వ్రాసిన పాటలన్నీ ప్రజల మనోభావాలను పుణికిపుచ్చుకుని ఉండేవి" ~ఎన్.టి.రామారావు     "ఆత్రేయ అంటే తెలుగు సాహితీ రంగంలో సాంఘిక నాటక యుగ కర్త, ఆత్రేయ అంటే తెలుగు సినీ జగత్తులో మాటల పసిడి కోట,పాటల ముత్యాలపేట" ~ డా.సి.నా.రె.     "బరువైన భావాల కొండలను చిటికెను వేలుపై గోవర్ధన గిరివలె సునాయాసంగా తేలిక మాటల్లో వహించడం,వచించడం గీతాచార్యుడికే(ఆత్రేయ)తెలుసు" ~వేటూరి సుందరరామ మూర్తి     "భాషను అదుపు చేయడంలోను, భావాన్ని అదుపు చేయడంలోను తిమ్మెర వంటి తేలిక మాటలతో తేనెలు, తీయని తావులు వెదజల్లడం ఆచార్యుడు(ఆత్రేయ)తిక్కనకు వారసుడు" ~వేటూరి సుందరరామ మూర్తి     "సినీ సాహితీ రంగంలో అపర శ్రీనాథుడు. తెలుగు సినిమా పాటకు సాహిత్య మందిరంలో పట్టాభిషేకం చేయించినవాడు" ~గొల్లపూడి మారుతీరావు     "శృంగారమైనా,మమకారమైనా తేలిక పదాలతో చదువుకున్న వాణ్ణి ,చదువులేని వాణ్ని గుండె లోతులవరకూ కదిలించగల ప్రతిభ ఆత్రేయది" ~ గొల్లపూడి మారుతీరావు     " తెలుగు సినిమాకు ఒక గొప్ప రూపాన్ని కల్పించిన రచయిత. తనదైన బాణీని ఇచ్చిన రచయిత ఆత్రేయగారు" ~గొల్లపూడి మారుతీరావు     "ఆత్రేయ వ్రాసిన పాటల్లో ప్రతి పల్లవి తీసుకొని ఒక కథ వ్రాయవచ్చు. అంత గంభీరమైన,భావస్పోరకమైన భాష ఆత్రేయది" ~కె.ఎస్.ప్రకాశరావు     " తెలుగు భాష తెలిసిన నటీనటులకు ఆత్రేయ సంభాషణలు పంచభక్ష్య పరమాన్నాలతో వడ్డించిన విస్తరి." ~ గుమ్మడి వెంకటేశ్వరరావు      "శ్రీ ఆత్రేయ వ్యక్తిగా చాలా నిరాడంబరుడు. ఆయన విలువ ఆయనకే తెలియని ఒక సామాన్యుడు. కత్తితో కోస్తే రక్తం వస్తే, ఆయన కలంతో రాస్తే రక్తం ఉడుకెక్కుతుంది. మనసు ఉరకలేస్తుంది.రాసినవాడికి కాదు, ఆయన రాసింది చదువుకునే వాడికి! ~ శ్రీ కె.విశ్వనాథ్     " శ్రీ ఆత్రేయ గారు స్వయంగా నటుడు, ప్రయోక్త,రచయిత కాబట్టి ప్రతి డైలాగు రాసిన తర్వాత నటుడిగా నటించుకొని, ప్రయోక్తగా ఎంతవరకూ కావాలో కుదించుకొని, అక్షరలక్షలుగా వ్రాయటం, ఆయనలోని ప్రత్యేకత." ~ మురళీమోహన్     " ఎక్కడ ఇపోతాయో...అన్నంత పొదుపుగా తన సంభాషణా రచనలో మాటల్ని వాడుకున్నవాడు ఆత్రేయ" ~తనికెళ్ళ భరణి     "తెలుగు సినిమా పాటకో మనసుని, ఉన్నతమైన భావాన్ని ఇచ్చిన ఘనత ఆత్రేయకు దక్కుతుంది." ~కె.రామలక్ష్మి ఆరుద్ర     "మామూలు మాటలతో పాటలని పొదగ వచ్చు అనే విషయాన్ని మొట్ట మొదటిగా ప్రదర్శించి చెప్పింది, ఆచరించి చూపింది ఆచార్య ఆత్రేయ" ~కొంగర జగ్గయ్య     "వేమన తరువాత ఆత్రేయ పుట్టాడు. అంత తేట తెలుగుదనం ఉంది ఆయన రచనలో" ~ హీరో కృష్ణంరాజు     "ఆత్రేయగారి డైలాగ్స్ కి ట్యూన్ కడితే పాట,ఆయన పాటని ట్యూన్ లేకుండా చదివితే డైలాగ్" ~సత్యానంద్     "సినీ సంభాషణా శైలిని పరిశీలిస్తే క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత అన్నట్లుగా "ఆత్రేయ పూర్వం-ఆత్రేయ తర్వాత" అని ఖచ్చితంగా అనవచ్చు." ~తోటపల్లి మధు.      "బరువైన తేలిక పదాలతో మనసుకు,మనిషికి కొత్త భాష్యాన్ని చెప్పినవారు ఆత్రేయ" ~డా.పర్వతనేని సుబ్బారావు     "తెలుగు సినీ జగత్తుని తన పాటల మాటల వెన్నెల జల్లుతో నిరంతరం పరవశింప జేస్తున్న నెలరేడు ఆత్రేయుడు" ~డా.తలతోటి పృథ్వి రాజ్

Tuesday, August 30, 2011

MANASUKAVI PDF BOOK ON ATHREYA LYRICS


AthreyaNatakaSahithyam-sambhashanalu-pdf book


acharya athreya antyarpana play pdf book


Sunday, August 28, 2011

PDF TEXT FILES ON ATHREYA

ఆచార్య ఆత్రేయ సినిమా సంభాషణల పై నేను పరిశోధన చేసి పిహెచ్.డి.పట్టా పొందినాక అనకాపల్లి లోని ఎ.ఎం.ఎ.ఎల్ కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా ఉద్యోగం చెయ్యడమే గాక  "ఆత్రేయ సాహితీ స్రవంతి" పేరుతో సాహితీ సంస్థను నెలకొల్పి ప్రతి సంవత్సరం ఆత్రేయ జయంతి వర్ధంతి సభలను నిర్వహిస్తుంది. ఆత్రేయ సంభాషణలపై పరిశోధన చేసే సమయంలోనే నేను "మన'సు'కవి","ఆత్రేయ నాటక సాహిత్యం-సంభాషణలు "పేరుతో విమర్శనాత్మక,విశ్లేషనాత్మక పుస్తకాలను రచించాను.ఇప్పుడు వారిని మీరు ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి పి.డి.ఎఫ్.ఫైల్ రూపంలో చదవ వచ్చు. మీరు ఏమైనా అక్షర దోషాలుగాని..మరేమైన విశేషాలుగాని తెలియజేయాలనుకుంటే athreyakilambi@gmail.com అనే mail కు గాని,లేదా talathotiprithviraj@gmail.com  కుగాని తెలియజేయగలరు. ఇందులో ఆత్రేయ సాహితీ స్రవంతి ఆశయాలను,ఆత్రేయ సంక్షిప్త పరిచయం,ఆత్రేయ సంభాషణలు రచించిన సినిమా పేర్లు...మొదలగు అంశాలనుకూడా చదవ వచ్చు. అంతే కాదు మీ కంప్యూటర్ లోకి కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.చదివి మెయిల్ ద్వారా మీ అభిప్రాయాలను తెలియ జేయగలరు. మరింకెందుకు ఆలస్యం ...క్రింది ఫైల్స్ పై క్లిక్ చెయ్యండి..


Saturday, May 7, 2011

Felicitation to Dr.Talathoti Prithvi Raj by Sahithee Mithrulu

ఆత్రేయ 90 వ జయంతిని పురస్కరించుకొని 2011 మే 7 వ తేదీ, సాయంకాలం 7 గంటలకు "సాహితీ మిత్రులు"అనే అనకాపల్లి లోని సాహితీ సంస్థ వారు ఆత్రేయ గారి సాహిత్యంపై విశేష కృషి,పరిశోధన చేసినందుకు నన్ను వారు ఆత్మీయంగా సన్మానించారు. నేను "మన'సు' కవి","ఆత్రేయ నాటక సాహిత్యం-సంభాషణలు"అనే అంశంపై విమర్శనాత్మక పుస్తకాలు రచించడమే గాక,"ఆత్రేయ సినిమా సంభాషణలు - ఒక పరిశీలన"అనే అంశంపై 
"ఆచార్య పర్వతనేని సుబ్బా రావు"గారివద్ద 2000 లో  పిహెచ్.డి.పూర్తిచేయ్యడం జరిగింది. ఇవిగాక..."ఆత్రేయ సాహితీ స్రవంతి"అనే సంస్థని ప్రారంభించి ఆత్రేయ జయంతి వర్ధంతి సభలను నిర్వహిస్తూ...,ఆత్రేయ సాహితీ పురస్కారాలను ప్రదానం చేస్తూ..."www.acharyaathreya.com" అనే website ను నిర్వహించడమే గాక "ఆత్రేయ సాహిత్యం పై ఎన్నో డాకుమెంట్స్ రూపొందించి "www.youtube.com" వంటి website లో ఉంచడం జరిగింది.ఈ రకమైన సేవలకుగాను వారు నన్ను సన్మానించారు. మొదట నిరాకరించిన సన్మానానికి అర్హుడనే అనే ఆలోచనతో అంగీకరించాను. నాపై అభిమానంతో నా సన్మాన సభకు విచ్చేసి నన్ను సన్మానించిన మిత్రులకు,నిర్వాహకులకు పేరు పేరున ధన్యవాదాలు. ప్రత్యేకించి సంకల్పించిన డా.ఇమ్మిదిశెట్టి చక్రపాణికి ప్రత్యేక ధన్యవాదాలు. నా భవిష్యత్ కార్యక్రమంగా ఆత్రేయ గారి విగ్రహాన్ని అనకాపల్లిలో ఏర్పాటు  చెయ్యాలనే  దృఢ సంకల్పంతో ఉన్నాను.   
ఆత్రేయ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన పృథ్విరాజ్ 

సభకు ముఖ్య అతిథి డా.తలతోటి పృథ్వీ రాజ్ ను పరిచయం చేస్తున్న జి.రంగబాబు.


ఆత్రేయ సాహిత్యం పై ఉపన్యసిస్తున్న పృథ్వీ రాజ్ 


సభకు అద్యక్షత వహించిన పృథ్వీ రాజ్ 

డా.తలతోటి పృథ్వీ రాజ్ ను సన్మానిస్తున్న సాహితీ మిత్రులు 

   
పృథ్వీ రాజ్ ను శాలువాతో ప్రత్యేకంగా సన్మానించిన జి.బ్రహ్మాజీ


పృథ్వీ నారాయణుడు

తే.గీ. అరయ తలతోటి యన్వయంబందు గలదు
        హైకు సామ్రాట్,ఆత్రేయకైనవాడు 
        నాని,తంకా,సెన్ రూల నాటగాడు
        పృథ్వి రాజుగా చరియుంచు సద్వివేకి 

కం.    తెలుగున  హైకూ రాజుగ 
         సలలిత నానీల యందు సరసపుటడుగులు
         వెలయించె నతడె,  పృథ్వీ
         తలమున నాత్రేయ కవిని తలచును నిచ్చన్ 

పృథ్వీ రాజ్ కృషిపై పద్యరచన చేసి సభలో ఆలపిస్తున్న శ్రీ భమిడిపాటి ప్రసాద రావు






Monday, April 11, 2011

ATHREYA JOKE

ఆంధ్రప్రభ సినిమా అనుబంధం "చిత్రప్రభ"వారి సౌజన్యంతో...

Monday, March 28, 2011

ACHARYA ATHREYA PHOTOS ఆచార్య ఆత్రేయ ఫోటోలు

ఆచార్య ఆత్రేయ గారి అరుదైన ఫోటోలు