ఆచార్య ఆత్రేయ సినిమా సంభాషణల పై నేను పరిశోధన చేసి పిహెచ్.డి.పట్టా పొందినాక అనకాపల్లి లోని ఎ.ఎం.ఎ.ఎల్ కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా ఉద్యోగం చెయ్యడమే గాక "ఆత్రేయ సాహితీ స్రవంతి" పేరుతో సాహితీ సంస్థను నెలకొల్పి ప్రతి సంవత్సరం ఆత్రేయ జయంతి వర్ధంతి సభలను నిర్వహిస్తుంది. ఆత్రేయ సంభాషణలపై పరిశోధన చేసే సమయంలోనే నేను "మన'సు'కవి","ఆత్రేయ నాటక సాహిత్యం-సంభాషణలు "పేరుతో విమర్శనాత్మక,విశ్లేషనాత్మక పుస్తకాలను రచించాను.ఇప్పుడు వారిని మీరు ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి పి.డి.ఎఫ్.ఫైల్ రూపంలో చదవ వచ్చు. మీరు ఏమైనా అక్షర దోషాలుగాని..మరేమైన విశేషాలుగాని తెలియజేయాలనుకుంటే athreyakilambi@gmail.com అనే mail కు గాని,లేదా talathotiprithviraj@gmail.com కుగాని తెలియజేయగలరు. ఇందులో ఆత్రేయ సాహితీ స్రవంతి ఆశయాలను,ఆత్రేయ సంక్షిప్త పరిచయం,ఆత్రేయ సంభాషణలు రచించిన సినిమా పేర్లు...మొదలగు అంశాలనుకూడా చదవ వచ్చు. అంతే కాదు మీ కంప్యూటర్ లోకి కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.చదివి మెయిల్ ద్వారా మీ అభిప్రాయాలను తెలియ జేయగలరు. మరింకెందుకు ఆలస్యం ...క్రింది ఫైల్స్ పై క్లిక్ చెయ్యండి..
No comments:
Post a Comment