"ఆత్రేయ పాటల్లో లోతైన భావాలు,జీవిత సత్యాలు,ఎంతో మేధస్సు ఇమిడి వున్నాయి. ప్రజల ఆలోచనలు,ఊహాగానాలు ఆయన పాటల్లో వుట్టిపడుతుంటాయి. మనిషి జీవిత అనుభవాలు,చీకటి,వెలుతురు,అపజయాల గురించి ఆయన హృదయాలకు హత్తుకునే విధంగా పాటలు రాశారు" ~ కీ.శే.ఎన్.టి.రామారావు     "మానవ జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులు, గెలుపు ఓటములను అనుభవాలను ప్రతిబింబిస్తూ మనసుల్ని కదిలించే విధంగా ఆయన రాసిన పెక్కు పాటలు చిరస్మరణీయాలై నిలిచాయి" ~ ఎన్.టి.రామారావు     "ఆత్రేయ వ్రాసిన పాటలన్నీ ప్రజల మనోభావాలను పుణికిపుచ్చుకుని ఉండేవి" ~ఎన్.టి.రామారావు     "ఆత్రేయ అంటే తెలుగు సాహితీ రంగంలో సాంఘిక నాటక యుగ కర్త, ఆత్రేయ అంటే తెలుగు సినీ జగత్తులో మాటల పసిడి కోట,పాటల ముత్యాలపేట" ~ డా.సి.నా.రె.     "బరువైన భావాల కొండలను చిటికెను వేలుపై గోవర్ధన గిరివలె సునాయాసంగా తేలిక మాటల్లో వహించడం,వచించడం గీతాచార్యుడికే(ఆత్రేయ)తెలుసు" ~వేటూరి సుందరరామ మూర్తి     "భాషను అదుపు చేయడంలోను, భావాన్ని అదుపు చేయడంలోను తిమ్మెర వంటి తేలిక మాటలతో తేనెలు, తీయని తావులు వెదజల్లడం ఆచార్యుడు(ఆత్రేయ)తిక్కనకు వారసుడు" ~వేటూరి సుందరరామ మూర్తి     "సినీ సాహితీ రంగంలో అపర శ్రీనాథుడు. తెలుగు సినిమా పాటకు సాహిత్య మందిరంలో పట్టాభిషేకం చేయించినవాడు" ~గొల్లపూడి మారుతీరావు     "శృంగారమైనా,మమకారమైనా తేలిక పదాలతో చదువుకున్న వాణ్ణి ,చదువులేని వాణ్ని గుండె లోతులవరకూ కదిలించగల ప్రతిభ ఆత్రేయది" ~ గొల్లపూడి మారుతీరావు     " తెలుగు సినిమాకు ఒక గొప్ప రూపాన్ని కల్పించిన రచయిత. తనదైన బాణీని ఇచ్చిన రచయిత ఆత్రేయగారు" ~గొల్లపూడి మారుతీరావు     "ఆత్రేయ వ్రాసిన పాటల్లో ప్రతి పల్లవి తీసుకొని ఒక కథ వ్రాయవచ్చు. అంత గంభీరమైన,భావస్పోరకమైన భాష ఆత్రేయది" ~కె.ఎస్.ప్రకాశరావు     " తెలుగు భాష తెలిసిన నటీనటులకు ఆత్రేయ సంభాషణలు పంచభక్ష్య పరమాన్నాలతో వడ్డించిన విస్తరి." ~ గుమ్మడి వెంకటేశ్వరరావు      "శ్రీ ఆత్రేయ వ్యక్తిగా చాలా నిరాడంబరుడు. ఆయన విలువ ఆయనకే తెలియని ఒక సామాన్యుడు. కత్తితో కోస్తే రక్తం వస్తే, ఆయన కలంతో రాస్తే రక్తం ఉడుకెక్కుతుంది. మనసు ఉరకలేస్తుంది.రాసినవాడికి కాదు, ఆయన రాసింది చదువుకునే వాడికి! ~ శ్రీ కె.విశ్వనాథ్     " శ్రీ ఆత్రేయ గారు స్వయంగా నటుడు, ప్రయోక్త,రచయిత కాబట్టి ప్రతి డైలాగు రాసిన తర్వాత నటుడిగా నటించుకొని, ప్రయోక్తగా ఎంతవరకూ కావాలో కుదించుకొని, అక్షరలక్షలుగా వ్రాయటం, ఆయనలోని ప్రత్యేకత." ~ మురళీమోహన్     " ఎక్కడ ఇపోతాయో...అన్నంత పొదుపుగా తన సంభాషణా రచనలో మాటల్ని వాడుకున్నవాడు ఆత్రేయ" ~తనికెళ్ళ భరణి     "తెలుగు సినిమా పాటకో మనసుని, ఉన్నతమైన భావాన్ని ఇచ్చిన ఘనత ఆత్రేయకు దక్కుతుంది." ~కె.రామలక్ష్మి ఆరుద్ర     "మామూలు మాటలతో పాటలని పొదగ వచ్చు అనే విషయాన్ని మొట్ట మొదటిగా ప్రదర్శించి చెప్పింది, ఆచరించి చూపింది ఆచార్య ఆత్రేయ" ~కొంగర జగ్గయ్య     "వేమన తరువాత ఆత్రేయ పుట్టాడు. అంత తేట తెలుగుదనం ఉంది ఆయన రచనలో" ~ హీరో కృష్ణంరాజు     "ఆత్రేయగారి డైలాగ్స్ కి ట్యూన్ కడితే పాట,ఆయన పాటని ట్యూన్ లేకుండా చదివితే డైలాగ్" ~సత్యానంద్     "సినీ సంభాషణా శైలిని పరిశీలిస్తే క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత అన్నట్లుగా "ఆత్రేయ పూర్వం-ఆత్రేయ తర్వాత" అని ఖచ్చితంగా అనవచ్చు." ~తోటపల్లి మధు.      "బరువైన తేలిక పదాలతో మనసుకు,మనిషికి కొత్త భాష్యాన్ని చెప్పినవారు ఆత్రేయ" ~డా.పర్వతనేని సుబ్బారావు     "తెలుగు సినీ జగత్తుని తన పాటల మాటల వెన్నెల జల్లుతో నిరంతరం పరవశింప జేస్తున్న నెలరేడు ఆత్రేయుడు" ~డా.తలతోటి పృథ్వి రాజ్

Athreya Dialogues

                              ఆత్రేయ సంభాషణలు రచించిన సినిమాల పేర్లు

    ఆత్రేయ సాహిత్యాభిమానులకి; కవి,పరిశోధకులు,ఆత్రేయ సాహితీ స్రవంతి వ్యవస్థాపకులు,అధ్యక్షులు డా.తలతోటి పృథ్వి రాజ్ నమస్కారాలు. ఆచార్య ఆత్రేయ గారి సినిమా సంభాషణలపై నేను చేసిన పరిశోధనలో కొన్ని ముచ్చటించు కోవాల్సిన అంశాలలో ప్రధానమైనది ఆత్రేయగారు సంభాషణలు రాసిన సినిమా పేర్లు సేకరించడంలో నేను పడ్డ పాట్లు.
     1995  లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ.పూర్తయి, జె.ఆర్.ఎఫ్.సెలెక్ట్ అయ్యాక రొటీన్ పరిశోధనా అంశాలకంటే భిన్నంగా, నా అభిరుచికి తగిన అంశంపై పరిశోధన చెయ్యాలని నిశ్చయించుకొని, అందుకు అవకాశం కల్పించిన ఆంధ్ర విశ్వ విద్యాలయంలో 1995 లో డా.పర్వతనేని సుబ్బా రావు గారి పర్యవేక్షణలో పిహెచ్.డి. చేరాను. అప్పటికే మనస్వినీ పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్,మద్రాస్ వారు "ఆత్రేయ సాహితీ" పేరుతో ప్రచురించిన ఏడు సంపుటాలు మార్కెట్ లోకి వచ్చాయి.
ఆత్రేయ గారి నాటక సాహిత్యం మీద పరిశోధనలు వివిధ విశ్వ విద్యాలయాల్లో జరిగాయి. ఆత్రేయ సినిమా పాటలపై పరిశోధన జరిగి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో " ఆత్రేయ సాహిత్యం - ఒక పరిశీలన "అనే అంశంను నేను ఎంచుకుంటే బాగుంటుంది అని మొదట ఆలోచించాను. అప్పటికే జరిగిన అంశాలపై నేను పరిశోధన చెయ్యడంలో నా ప్రత్యేకత ఏముంది అని అలోచించి ఆత్రేయ సాహిత్యంలో పరిశోదనకు స్వీకరించబడని అంశంగా ఉన్న "ఆత్రేయ సినిమా సంభాషణలు"ను నా పరిశోధనా అంశంగా ఎంచుకున్నాను. టాపిక్ ఎంచుకోవడమైతే ఎంచుకున్నానుగాని, ఇంతకీ ఆత్రేయ సంభాషణలు రాసిన సినిమాల పేర్లేమిటి ?,ఎన్ని సినిమాలకు ఆత్రేయ సమకూర్చారు ? అనే ప్రశ్నలు నాలో తలెత్తాయి. ఆత్రేయ ఎన్ని సినిమాలకు సంభాషణలు రాసాడో...అవి ఏ ఏ చిత్రాలో ఎక్కడా సమాచారం లేదు. 1951 లో "దీక్ష"  చిత్రం ఆత్రేయ సంభాషణలు సమకూర్చిన తొలి చిత్రం కాగా, ఆత్రేయ సంభాషణలు సమకూర్చిన ఆఖరి చిత్రం 1989 లో విడుదలైన" లైలా ".  ఆత్రేయగారి భార్య పద్మావతి గారితోబాటు ఆత్రేయగారితో పరిచయం ఉన్నమురారి,డా.డి.రామానాయుడు,కొంగర జగ్గయ్య, జె.కె.భారవి,డి.వి.నరస రాజు,ఆకెళ్ళ,తనికెళ్ళ భరణి,తోటపల్లి మధు,అప్పలాచార్య,అక్కినేని నాగేశ్వర రావు,గుమ్మడి వెంకటేశ్వర రావు ,బొల్లిముంత శివరామ కృష్ణ, కాశీ విశ్వనాథ్, పైడిపాల... ఇలా ఎందరినో కలిసినప్పటికీ ఎవ్వరూ పదీ,పదిహేను చిత్రాలకు మించి చెప్పలేక పోయారు. ఆ పరిస్థితుల్లో నా సమస్యకు ఒక అద్భుతమైన ఐడియా పరిష్కారంగా తోచింది. అదేమిటంటే...ఓ నిర్మాణ సంస్థ ఒక కొత్త సినిమాను నిర్మించ బోతున్నప్పుడు ఆ సినిమాకు వారు ఎంచుకున్న నటీ నటులతోబాటు సాంకేతిక వర్గాన్ని అంటే...కెమెరామెన్,కొరియో గ్రాఫర్ లాంటి వారితో పాటు పాటలూ,మాటలూ ఫలానా వాళ్ళు అని పత్రికా ముఖంగా ఆ చిత్ర దర్శక - నిర్మాతలు వెల్లడించడం నేటికీ ఒక సంప్రదాయంగా వస్తున్న  విషయంగా మనం దిన పత్రికల్లోని సినిమా పేజీలను పరిశీలించి గ్రహించవచ్చు. అంటే నేను 1951 నుండి 1989  వరకు వివిధ దినపత్రికలను పరిశీలిన్చాలన్నమాట!. ఇంతవరకు బాగానే ఉంది. ఏ లైబ్రరీలలో 1951 నాటినుంచి భద్రపరిచిన పేపర్లు దొరుకుతాయి? నాకొచ్చిన మరో అనుమానం!  పరిశోధకులకు కల్పతరువులాంటి వేటపాలెం లైబ్రరీకి వెళ్లాను. పేపర్లు ముట్టుకుంటే విరిగిపోతున్నాయని ఇంకేవో కారణాలు చెప్పి నన్ను తిప్పి పంపించారు. పరిశోధనకి తొలి మెట్టైన యీ వ్యవహారానికి మరే లైబ్రరీకి వెళ్ళాలి అని ఆలోచిస్తూ విచారించగా హైదరాబాద్ లోని మూసీనది తీరాన అఫ్జల్ ఘంజిలో ఉన్న స్టేట్ సెంట్రల్ లైబ్రరీకి ఆశతో వెళ్ళాను. ఆశ నెరవేరింది.1951  నాటి ఆంధ్ర సచిత్ర దిన పత్రిక మొదలుకొని ఆతర్వాత వచ్చిన వివిధ పత్రికల్ని కొన్ని నెలల పాటు జాగ్రత్తగా తిరగేసి ఆత్రేయ గారు సినిమా మాటలు రాసాడని వివరాలున్న వార్తల ఆధారంగా సినిమా పేర్లు సేకరించాను. ఆ తర్వాత సినిమా సంభాషణలు సేకరించే క్రమంలో కొన్ని వేరే రచయితలు సంభాషణలు రాశారని గ్రహించాను. ఈ అన్వేషణలో ఒకసారి ఒక పదినిమిషాలు లైబ్రరీలో చిక్కుకు పోయాను. లైబ్రరీ క్లోజ్ చేసే సమయం గ్రహించలేదు. మెడ పైభాగంలో ర్యాక్లమధ్య నేను నిశ్శబ్దంగా    వెతుక్కుంటూ ఉండగా ఎవరూ లేరనుకున్నారో ఏమో అక్కడ ఉండే అతను ఆ గదికి తాళాలేసి వెళ్ళిపోయాడు. క్రింద మెయిన్ డోర్ కూడా క్లోజ్ చేసి విల్లబోతున్న సమయంలో గట్టిగా కేకలేసాను. ఆ పిలుపికి వచ్చి తలుపు తీశారు. ఆక్షణాన అంబేద్కర్ గుర్తుకొచ్చాడు. 
      ఇన్ని విషయాలు ఎందుకు చెప్పాలనిపించిందంటే... ఆత్రేయ సంభాషణలు రాసిన చిత్రాల పేర్లు కనుక్కోవడమే నాకు ఒక ఎం.ఫిల్ వర్క్ అంత పని అయ్యింది. కష్టపడకుండా పిహెచ్.డి వస్తుందా అని అంటారేమో! నిజమే ...ఏమీ లేకుండా రైతులకు పట్టా పుస్తకాలు పంచుతున్నట్టు పిహెచ్ .డి లు పంచుతున్న కాలంలో ఎంతో శ్రమ, ఎంతో ధనాన్ని వెచ్చించి పరిశోధన చేసాను. తనివితీరక ఆత్రేయ గూర్చి ఎన్నో చెప్పాలని ఇలా బ్లాగ్ ను రూపొందించి ఎన్నో విషయాలను తెలియ జేస్తున్నాను. సినిమాలు తెలిసాక వాటినెలా సంపాదించానో మరోచోట పంచుకుంటాను నా అనుభవాలు. క్రింది సినిమాల్లో అత్రేయవి కానివి ఉన్నట్లు మీరు గ్రహిస్తే kavitalathoti@gmail.com అనే మెయిల్ కి తెలియ జేస్తే సవరించుకోగాలను.                                                                                   

అంగడి బొమ్మ
అండమాన్ అమ్మాయి 
అంతస్తులు 
అంతా యింతే
అంతులేని కథ
అంతే కావాలి
అందరూ దొంగలే
అక్క చెల్లెలు
అగ్గి రాముడు(పాతది)
అగ్నిజ్వాల
అగ్ని సమాధి
అత్తగారు కొత్త కోడలు
అదృష్టవంతులు 
అనురాగం
అనురాధ
అభినందన
అమ్మ ఎవరికైనా అమ్మ
అమ్మ కోసం 
అయ్యప్పస్వామి మహాత్మ్యం
అర్ధాంగి
ఆడబ్రతుకు
ఆత్మకథ
ఆత్మబలం
ఆదర్శ కుటుంబం
ఆరాధన
ఆలుమగలు
ఆస్తిపరులు
ఆస్తులు-అంతస్తులు
ఇంటికిదీపం ఇల్లాలే
ఇంద్ర ధనుస్సు
ఇకనైనా మారండి
ఈతరం ఇల్లాలు
ఈతరం మనిషి
ఎదురీత(పాతది)
ఒక చల్లని రాత్రి
కన్న తల్లి
కనిపించే దేవుడు
కానిస్టేబుల్ కూతరు
కలిసిన మనసులు
కలియుగ రాముడు
కుల గోత్రాలు
కుర్ర చేష్టలు
కెప్టెన్ నాగార్జున
కొడుకు కోడలు 
కోడెనాగు
గుమస్తా 
గువ్వల జంట 
గృహలక్ష్మీ
చక్ర ధారి
చక్రవాకం
చిత్ర లేఖ
చిలకా - గోరింక
చిలిపి కృష్ణుడు 
జగమొండి 
జయభేరి
జాలీబర్డ్స్   
 జీవన తరంగాలు
జేగంటలు
జేబుదొంగ
డా.ఆనంద్
డా.చక్రవర్తి
తాళిబొట్టు
తోడికోడళ్ళు
తేనెమనసులు
దసరా బుల్లోడు
ధర్మాత్ముడు
దీక్ష
దేవదాసు(కృష్ణ సినిమా )
దేవుని రూపాలు
దేశం కోసం 
దేశమంటే మట్టికాదోయ్ 
దొంగలున్నారు జాగ్రత్త 
దొంగల్లో దొర 
నా తమ్ముడు
న్యాయం మీరే చెప్పాలి
నీరాజనం
పాపకోసం
పారిజాతం
ప్రతిబింబాలు
పిచ్చిపంతులు
ప్రియ 
పుణ్యంకొద్దీ పురుషుడు
పునర్జన్మ
పెళ్ళికానుక
పెళ్ళి పిలుపు
ప్రేమ
ప్రేమకోసం
ప్రేమనగర్
ప్రేమలు - పెళ్ళిళ్ళు
పొట్టేలు పున్నమ్మ
బంగారు కానుక
బంగారు బాబు
బంగారు బొమ్మలు
బండరాముడు
బడిపంతులు(పాతది)
బాబు
భక్త కబీరు దాసు
భార్యా భర్తల బంధం
భార్యా బిడ్డలు
మంచి కుటుంబం
మంచీ చెడు
మంచి మనసులు
మంచి మనసులు(కొత్తది)
మంచివాడు
మధుర స్వప్నం
మనుషులు - మమతలు
మనసు - మాంగల్యం
మనసే మందిరం
మనోహరం
మరో మొనగాడు
మరపురాని మనిషి
మరోరాముడు
మల్లె పువ్వు
మహాత్ముడు
మాంగల్య బలం
మాతృ ప్రేమ
మానవుడే మహనీయుడు
ముందడుగు (పాతది)
ముద్దుల మొగుడు
మురళీ కృష్ణ
మూగమనసులు
మూగ ప్రేమ
మూగవాని పగ
మూల ధనం
మైనరు బాబు
ఎస్.పి.భయంకర్
రాజా రమేష్
రామకృష్ణులు
రామదండు
రామ లక్ష్మణులు
ఋణానుబంధం
రేచుక్క(భానుచందర్)
లైలా 
వాగ్ధానం
విచిత్ర బంధం 
విజేత
విశాలి
వెలుగు నీడలు
శెభాష్ సత్యం
శెభాష్ సూరి
శాంతి నిలయం
శిక్ష
శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం
సంగీత లక్ష్మీ
సంసారం - సంతానం 
సతీ సావిత్రి (రామారావు)
సహస్ర శిరచ్చేద  అపూర్వ చింతామణి
సుప్రభాతం
సుమంగళి
సూపర్ మెన్ 
సెక్రెటరీ