ఆత్రేయ 90 వ జయంతిని పురస్కరించుకొని 2011 మే 7 వ తేదీ, సాయంకాలం 7 గంటలకు "సాహితీ మిత్రులు"అనే అనకాపల్లి లోని సాహితీ సంస్థ వారు ఆత్రేయ గారి సాహిత్యంపై విశేష కృషి,పరిశోధన చేసినందుకు నన్ను వారు ఆత్మీయంగా సన్మానించారు. నేను "మన'సు' కవి","ఆత్రేయ నాటక సాహిత్యం-సంభాషణలు"అనే అంశంపై విమర్శనాత్మక పుస్తకాలు రచించడమే గాక,"ఆత్రేయ సినిమా సంభాషణలు - ఒక పరిశీలన"అనే అంశంపై
"ఆచార్య పర్వతనేని సుబ్బా రావు"గారివద్ద 2000 లో పిహెచ్.డి.పూర్తిచేయ్యడం జరిగింది. ఇవిగాక..."ఆత్రేయ సాహితీ స్రవంతి"అనే సంస్థని ప్రారంభించి ఆత్రేయ జయంతి వర్ధంతి సభలను నిర్వహిస్తూ...,ఆత్రేయ సాహితీ పురస్కారాలను ప్రదానం చేస్తూ..."www.acharyaathreya.com" అనే website ను నిర్వహించడమే గాక "ఆత్రేయ సాహిత్యం పై ఎన్నో డాకుమెంట్స్ రూపొందించి "www.youtube.com" వంటి website లో ఉంచడం జరిగింది.ఈ రకమైన సేవలకుగాను వారు నన్ను సన్మానించారు. మొదట నిరాకరించిన సన్మానానికి అర్హుడనే అనే ఆలోచనతో అంగీకరించాను. నాపై అభిమానంతో నా సన్మాన సభకు విచ్చేసి నన్ను సన్మానించిన మిత్రులకు,నిర్వాహకులకు పేరు పేరున ధన్యవాదాలు. ప్రత్యేకించి సంకల్పించిన డా.ఇమ్మిదిశెట్టి చక్రపాణికి ప్రత్యేక ధన్యవాదాలు. నా భవిష్యత్ కార్యక్రమంగా ఆత్రేయ గారి విగ్రహాన్ని అనకాపల్లిలో ఏర్పాటు చెయ్యాలనే దృఢ సంకల్పంతో ఉన్నాను.
ఆత్రేయ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన పృథ్విరాజ్
సభకు ముఖ్య అతిథి డా.తలతోటి పృథ్వీ రాజ్ ను పరిచయం చేస్తున్న జి.రంగబాబు.
ఆత్రేయ సాహిత్యం పై ఉపన్యసిస్తున్న పృథ్వీ రాజ్
సభకు అద్యక్షత వహించిన పృథ్వీ రాజ్
డా.తలతోటి పృథ్వీ రాజ్ ను సన్మానిస్తున్న సాహితీ మిత్రులు
పృథ్వీ రాజ్ ను శాలువాతో ప్రత్యేకంగా సన్మానించిన జి.బ్రహ్మాజీ
పృథ్వీ నారాయణుడు
తే.గీ. అరయ తలతోటి యన్వయంబందు గలదు
హైకు సామ్రాట్,ఆత్రేయకైనవాడు
నాని,తంకా,సెన్ రూల నాటగాడు
పృథ్వి రాజుగా చరియుంచు సద్వివేకి
కం. తెలుగున హైకూ రాజుగ
సలలిత నానీల యందు సరసపుటడుగులు
వెలయించె నతడె, పృథ్వీ
తలమున నాత్రేయ కవిని తలచును నిచ్చన్
పృథ్వీ రాజ్ కృషిపై పద్యరచన చేసి సభలో ఆలపిస్తున్న శ్రీ భమిడిపాటి ప్రసాద రావు