ఆత్రేయ నాటక,సినిమా సాహిత్యాలపై ఇప్పటివరకు వివిధ విశ్వ విద్యాలయాలపై జరిగిన పరిశోధనలు. వెలువడిన గ్రంథాలు
- శ్రీ ఎ.వి.రవీంద్ర కుమార్ "ఆత్రేయ నాటికా సాహితి"అనే అంశంపై శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి 1980 లో ఎం.ఫిల్.సిద్థాంత గ్రంధాన్ని సమర్పించారు.
- శ్రీ పైడిపాల "ఆత్రేయ నాటాకాలు - పూర్వాపరాలు "అనే అంశంపై ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 1984 లో ఎం.ఫిల్.సిద్థాంత గ్రంధాన్ని సమర్పించారు.
- కె.రాధాదేవి "ఆత్రేయ అభ్యుదయ ఆదర్శాలు"అనే అంశంపై మద్రాసు విశ్వవిద్యాలయానికి 1990 లో సిద్థాంత గ్రంధాన్ని సమర్పించారు.
- కె.స్వర్ణలత "ఆత్రేయ విశ్వ శాంతి - వైశిష్ట్యం"అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయానికి 1992 లో సిద్థాంత గ్రంధాన్ని సమర్పించారు.
- కె.బి.శ్రీలక్ష్మీ " ఆత్రేయ సినీ గీతాలు - ఒక పరిశీలన "అనే అంశంపై శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి 1994 లో పిహెచ్.డి.సిద్థాంత గ్రంధాన్ని సమర్పించారు.
- శ్రీమతి ఆదుర్తి వెంకటనాగా శోభ " ఆత్రేయ - కన్నదాసన్ పాటలు - ఒక తులనాత్మక పరిశీలన "అనే అంశంపై మద్రాసు విశ్వవిద్యాలయానికి పిహెచ్.డి.సిద్థాంత గ్రంధాన్ని సమర్పించారు.
- శ్రీ తలతోటి పృథ్వి రాజ్ " ఆత్రేయ సినిమా సంభాషణలు - ఒక పరిశీలన "అనే అంశంపై ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 1999 లో పిహెచ్.డి.సిద్థాంత గ్రంధాన్ని సమర్పించారు
ఆత్రేయ నాటక,సినిమా సాహిత్యాలపై వెలువడిన గ్రంథాలు.
- " ఆత్రేయ సాహితి " పేరున కీ.శే.కొంగర జగ్గయ్య సంపాదకత్వంలో మనస్వ్విని పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్, మదరాసు వారు 1990 లో ప్రచురించిన ఏడు సంపుటాలు.
- "ఆచార్య ఆత్రేయ తెలుగు నాటక రంగం "అనే పేరుతో మొదలి నాగభూషణ శర్మ సంపాదకత్వంలో 1986 లో ప్రచురింపబడిన గ్రంధం