రచయితలకు దిక్సూచి ఆత్రేయ
"నేటి తెలుగు సినిమా పాటల , మాటల రచయితలకు దిక్సూచి ఆచార్య ఆత్రేయ" అని మద్దుల అప్పారావు అన్నారు. ఆత్రేయ సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో అనకాపల్లి శాఖా గ్రంధాలయంలో సోమవారం ఉదయం 9 గంటలకు మనసుకవి, మన"సు"కవి ఆచార్య ఆత్రేయ 92 వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అప్పారావు మాట్లాడుతూ "గీతాచార్యుడు ఆచార్య ఆత్రేయ. ఆయన పాటలు, మాటలు తెలుగువారి మనస్సులో చిరస్మరణీయం" అని అన్నారు. తొలుత ఆత్రేయ సాహితీ స్రవంతి సభ్యులు ఆత్రేయ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కర్రి దివాకర్ ఆత్రేయ నిరాడంబర తనాన్ని, ఆత్రేయ వ్యక్తిత్వాన్ని సభకు వివరించారు. రాయక నిర్మాతల్ని,రాసి ప్రేక్షకుల్ని ఆత్రేయ ఏడిపిస్తాడు అనే లోకవ్యవహారంలోని మాటవెనుక ఆత్రేయ గొప్పగా రాయాలని తపించేవాడని చెప్పాడు. ఆత్రేయ సాహితీ స్రవంతి ప్రధాన కార్యదర్శి డా.ఇమ్మిడిసెట్టి చక్రపాణి మాట్లాడుతూ ఆత్రేయ సాహితీ స్రవంతి ప్రతి ఏటా ఆత్రేయ గారి జయంతి వర్ధంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న కార్యక్రమాలను, చిత్రపరిశ్రమలోని ప్రముఖ రచయితలు ఇస్తున్న "ఆత్రేయ సాహితీ పురస్కారాలను " సభకు వివరించారు.
ఆత్రేయ సాహితీ స్రవంతి వ్యవస్థాపక అధ్యక్షులు డా.తలతోటి పృథ్వీ రాజ్ www.acharyaathreya.com అనే వెబ్ సైట్ ను రూపొందించి దానిద్వార ఆత్రేయ సాహిత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉండేందుకు ఇప్పటివరకు ఆత్రేయ సాహితీ స్రవంతి తరఫున చేసిన కృషిని సభకు వివరించారు. ప్రముఖ కథకులు జి.రంగబాబు అతిథులను వేదిక మీదకు ఆహ్వానించగా , శిష్ట్లా తమ్మిరాజు ప్రార్థనా గీతంతో మొదలైన కార్యక్రమం గట్టి బ్రహ్మాజీ వందన సమర్పణతో ముగిసింది. ఈ కార్యక్రమంలో గ్రందాలయాదికారిణి వరలక్ష్మి, గ్రందాలయ సిబ్బంది, ఆత్రేయ అభిమానులు పాల్గొన్నారు.
ఆత్రేయ జయంతి చిత్రమాలికలు
పూలమాలతో ఆత్రేయ చిత్రపటాన్ని అలంకరించి నివాళి అర్పిస్తున్న ఆత్రేయ సాహితీ స్రవంతి సభ్యులు.
అతిథులను వేదికమీదకి ఆహ్వానిస్తున్న హైకూ క్లబ్ గౌరవ అధ్యక్షులు శ్రీ జి.రంగబాబు.
శ్రీ శిష్ట్లా తమ్మిరాజు ప్రార్థనా గీతంతో ప్రారంభమైన కార్యక్రమం.
ప్రసంగిస్తున్న ఆత్రేయ సాహితీ స్రవంతి గౌరవ అధ్యక్షులు శ్రీ కర్రి దివాకర్
ముఖ్య అతిథిగా ఆత్రేయపై మాట్లాడుతున్నా హైకూ క్లబ్ పోషకులు శ్రీ మద్దుల అప్పారావు
ఆత్రేయసాహితీ స్రవంతి ప్రధాన కార్యదర్శిడా.ఇమ్మిడిసెట్టి చక్రపాణి
ఆత్రేయసాహితీ స్రవంతి ప్రధాన కార్యదర్శిడా.ఇమ్మిడిసెట్టి చక్రపాణి
సభకు హాజరైన సాహిత్యాభిమానులు
వందన సమర్పణ చేస్తున్న హైకూ క్లబ్ ప్రధాన కార్య దర్శి శ్రీ గట్టి బ్రహ్మాజీ
No comments:
Post a Comment